ఒక్కోసారి ఏముంటుందిలే అనుకుని సినిమా చూస్తే ఎంతోబావుందనిపిస్తుంది జంధ్యాల ఆనందభైరవిలాగ. ఇప్పుడు విషయం సినిమా గురించి కాదుగాని క్రిందటినెల్లో చూసిన పాపికొండలు గురించి.
ప్రతిసారి సెలవుల్లో ఇంటికెళ్లినప్పుడు ఫ్రెండ్స్ తోకలసి ఏదోఒక టూరుకెళ్ళడం అలవాటు. ఈసారి కూడా ఎక్కడెక్కడికో వెళదామని ప్లాన్ చేసినా ఎందుకో ఏదీకుదరక చివరికి పక్కనే ఉన్న పాపికొండలు చూద్దామని ఫిక్సయ్యాం. ఇక చూడటం మొదలుపెట్టాకా ఎక్కడికొచ్చానో కాసేపు అర్ధంకాలేదు. సన్నగా పడుతున్న వర్షంలో తడుస్తూ బోటుపై నిలబడి గోదావరిని చూస్తూఉంటే............
మంటల కంఠంతో కసురుకుంటున్న సూర్యుడి వేడి ముప్పు తప్పించుకోడానికి ఆకాశం కప్పుకున్న మేఘాల పరదాలు చినుకు ముత్యాలు చల్లుతుంటే మురిసి ముద్దౌతున్న గోదారి పరువాలు ముద్దొస్తూ, ముందింత అందమున్నా మౌనమేంటని నిందిస్తూ, మొహమాటానికైనా నాలుగు మాటలు రువ్వమని కవ్విస్తూ, హొయల లయల చలన భంగిమల అందాల విందిస్తూ, మబ్బుల చాటుల్లోంచి తప్పించుకొచ్చిన వెలుగు రేఖల పువ్వుల్ని అలలపైన పూయిస్తూ, కాసుల వేటలోపడి గతితప్పిన మనసుల గమ్యాన్ని కాసేపైనా మళ్లిస్తూ, మరచిపోయిన ఙాపకాల్ని మళ్లీఇస్తూ, తీరిక లేదని చెప్పే సాకులకి పచ్చ పరికిణీ కప్పుకున్న ప్రకృతిసోకుల్ని ఎరగావేస్తూ, ఎగిరెగిరి పడుతున్న నా కళ్లలో ఆశ్చర్యాన్ని ఆస్వాదిస్తూ, మళ్లీరమ్మని ఆహ్వానిస్తూ, ఎపుడొస్తావని ఎదురుచూస్తూ.... ఉన్నట్టనిపించింది. ఇక వదలి వెళ్ళేప్పుడు మాత్రం కష్టాలన్నీ మర్చిపోగల ఙాపకాలు మనసునిండా నిండిపోయినట్టనిపించింది.
ఆ ఫొటోలే మీకూ చూపిద్దామని ఈ ఫొటోస్ట్









ఇంచుమించు ఎనిమిది గంటలపాటు గోదారిపై సాగే ప్రయాణం మర్చిపోలేనట్టుగా మిగిలిపోవాలంటే మాత్రం ప్రకృతి కరుణించక తప్పదు. ఎందుకంటే పైన ఎండకాస్తుంటే మనంలోన కూర్చోవాలి. అదే ఆకాశమంతా మబ్బులు కమ్ముకొని సన్నగాచినుకులు పడుతుంటే చూడ్డానికి అద్దిరిపోద్ది. రాజమండ్రి దగ్గర ఆరుకిలోమీటర్ల వెడల్పున ప్రవహించే గోదావరి భద్రాచలం నుండి కొండల మధ్య వస్తూ సన్నటి పాపిటగా మారిపోతుంది అందుకే ఈ కొండలకి పాపిటకొండలని పేరు. కాని కాలం క్రమంగా మారుతూ వీటి పేరుని కూడా పాపికొండలుగా మార్చేసింది. (ఈ విషయం గైడ్ చెప్పేవరకు నాకు తెలీదు)
29 comments:
అద్భుతం!
పాపికొండలు చూడాలంటే ఎలా వెళ్ళాలి ? వివారాలు చెపితే నేను ఒకసారి చూస్తాను.
అన్దరూ చుసి ఆనందింఛి మైమరిచే అందాలు .మన పాపి కొండల అందాలు..మేము వెళ్లి రెండేల్లైంది.మల్లీ వెళ్ళాలను కుంటున్నాను.
చాలా.. చాలా...బాగున్నాయి ఫొటోస్ .
Excellent pics
మాది భద్రాచలమే నండి.. ఓ సారి మావూరు గుర్తు చేసారు.. ఇంతకీ రాజమండ్రి మీదుగా వెళ్ళారా.. లేక..భద్రాచలం మీదుగానా..?
ఫొటోస్ బావున్నాయండి ! మేము లాస్ట్ ఇయర్ ఖమ్మం అంటే కూనవరం నుండి వెళ్ళాం ఈ పాపికొండలు ట్రిప్ .
ఫోటోలు బాగున్నాయండీ. నేను మూడు సంవత్సరాలక్రితం రాజమండ్రి నుంచి పాపికొండలు యాత్రకు వెళ్ళాను. ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది. నా బ్లాగ్ ఫోటో కూడా పాపికొండలే.
శ్రీవాసుకి
శ్రీ గారు ఈ వెబ్ సైట్ చూడండి వివరాలు తెలుస్తాయి.http://www.papihillsyatra.com/
రాధిక గారు అయితే త్వరగా వెళ్ళిరండి ఇప్పుడైతే బావుంటాయి చూడ్డానికి.
స్వప్న గారు థేంక్యు.
శివ చెరువు గారు రాజమండ్రి నుండి వెళ్ళామండి భద్రాచలం వరకు వెళ్ళలేదు రెండవరోజు కూడా ఉండాలని.
శ్రావ్య గారు, థేంక్యు .... కూనవరం నుండి కూడా వెళ్ళొచ్చా.... నాకు దారిలో తగిలినట్టు అనిపించలేదు.
శ్రీవాసుకి గారు థేంక్యు, మీ బ్లాగు చూసాను బాగుంది.
ఎంత మాట 3g గారు మీ గోదావరి జిల్లాల వాళ్లకి తెలియకపొవటమా? కంప్లీట్ పాపికొండలు ట్రిప్ అంటే రాజమండ్రి నుండి భద్రాచలం వరకు , కాని మీరు రాజమండ్రి నుండి భద్రాచలం వరకు రాకుండా మధ్యలో నుండి తిరిగి వెళ్లారు కదా అలాగే భద్రాచలం నుంచి కూడా సగం వరకు ట్రిప్ ఉంటుంది . కాకపొతే భద్రాచలం నుంచి ట్రిప్ అంటారు కాని అది కూనవరం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట , భద్రాచలం నుండి ఒక గంట రోడ్డు ప్రయాణం ఉంటుంది అదీ సంగతి . కాకపోతే ఈ ట్రిప్ మాత్రం భద్రాచలం వైపు నుంచి కన్నా రాజమండ్రి నుండే బాగుంటుంది అని నాకు తెలిసిన సమాచారం .
నేను అప్పుడెప్పుడొ రాజమండ్రి నుండి పేరంటాలపల్లి, అక్కడ ఒకరొజు బస, మర్నాడు తిరుగుప్రయాణం. మేము వెళ్ళినప్పుడు పేరంటాలపల్లి కి కరెంట్ కూడా లేదు (ఇప్పుడు వుందా ??) ఇప్పుడు తలచుకుంటే మంచి థ్రిల్లింగ్ గా వుంటుంది కానీ ఆ రోజు నరకయాతన అనుభవించాం... ఒక గొడ్లచావిట్లొ బస... తిండి లేదు.. బయట వర్షం, చిమ్మచీకటి ... అహ.. ఒక పొస్ట్ రాసెయొచ్చు :-))
ఫొటొలు మాత్రం చాలా బాగా వచ్చాయి... కిందనుండి రెండొ ఫొటొ చూస్తే నాకు పేరంటాలపల్లె గుర్తొచ్చింది ...
శ్రావ్య గారు నిజంగానే తెలీదండి...... అయినా నాక్కొంచెం పరిసరాల విజ్ఞానం తక్కువ లెండి.
>>భద్రాచలం నుంచి ట్రిప్ అంటారు కాని అది కూనవరం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట>>
ఇది కూడా అంతేనండి రాజమండ్రి అంటారు కాని పట్టిసీమ నుండి మొదలవుతుంది.
మంచు గారు 3,5 & 6 ఫొటోలు పేరంటలపల్లి గుడికి వెళ్ళే మెట్లపై నుండి తీసినవి. ఇప్పుడు కరెంట్ ఉన్నట్టుందండి సరిగా గమనించలేదు.
క్రిందనుండి రెండవ ఫొటొ లాంటివి దారంతా కనిపించాయి పచ్చిక బయళ్ల మీద ఆవులు గుంపులు గా.
>>ఇప్పుడు తలచుకుంటే మంచి థ్రిల్లింగ్ గా వుంటుంది కానీ ఆ రోజు నరకయాతన అనుభవించాం..>>
ఇలాంటి అనుభవమే ఒకసారి నాక్కూడా అరకు వెళ్ళినప్పుడు ఎదురైంది అందుకే ఈట్రిప్ ఒక్కరోజుకే కుదించాం.
ఇప్పుడిక్క నైట్ స్టే చెయ్యాలంటే పైనుండి నాలుగో ఫొటోలో కొన్ని హట్స్ కనిపిస్తున్నాయి కదా వాటిలో ఉండొచ్చు. సౌకర్యాలు ఎలా ఉంటయో తెలీదు.
>>ఫొటొలు మాత్రం చాలా బాగా వచ్చాయి>>
Thank u...అయితే ఫరవాలేదు నోకియా న్యాయంచేసిందన్న మాట.
సూపర్ ఫొటోస్, గత కొన్ని యేళ్ళగా అనుకుంటున్నాం పాపికొండలు, గోదారి చూడాలని...కుదిరితే కదా...ఈసారయినా మిస్ అవ్వకుండా వెళ్ళాలి.
3g గారు భలే బాగున్నాయి పొటోస్ ..నేను చూడలేదు పాపికొండలు.. ఎమో ఎప్పుడు కుదురుతుందో ఏమో.. పొటోస్ చూఊస్తె వెంటనే వెళ్ళి చూడాలని ఉంది
3g gaaru,
అన్ని ఫోటోస్ ఒకే dimension లో ఎలా వచ్చాయి? Is this photo blog? నేను వారం రోజుల నుండి తిప్పలు పడుతున్నాను. నా cybershot camara లో తీసాను.system లో బాగా కనపడుతున్నాయి.బ్లోగ్ లోకి వచ్చేసరికి చిన్నగా అయిపోతున్నాయి. ఏం చేయాలో కాస్త చెపుతారా?
www.ramyamgakutirana.blogspot.com ఒకసారి చూస్తారా?
సౌమ్య గారు, నేస్తం గారు ఫొటోలు నచ్చినందుకు ధన్యవాదాలు. మంచి టైం చూసుకొని వెళ్ళివచ్చెయ్యండి త్వరగా ఓ పనైపోతుంది. కాని ఎండలుగా ఉన్నప్పుడు వెళ్ళకండి బోట్ లోపలే కూర్చుని వెళ్ళాలి బోర్ కొడుతుంది.
నీహారిక గారు ఇది ఫొటో బ్లాగ్ కాదండి. మీరు పిక్చర్ లోడ్ చేసిన తరువాత డీఫాల్ట్ గా స్మాల్ ఇమేజ్ వస్తుంది, అలాకాకుండా దానిపైన క్లిక్ చేస్తే ఒక టూల్ బార్ వస్తుంది దాంట్లో ఇమేజ్ సైజుకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి వాటిలో ఎక్స్ ట్రా లార్జ్ ని సెలెక్ట్ చేసుకోండి. మీబ్లాగ్ చూసాను మీదికూడా బ్లాగర్ సైటు కాబట్టి ఇవే ఆప్షన్స్ ఉండొచ్చు.
Wow..excellent pics..Though i studies in Rjy for 4 years, couldnt see papikondalu.. :-(. Have to go and see it, hope time permits me soon. Thanks for sharing 3G.
you are welcome Kishan
లేట్ గా చూసాను సుమా మీ పొస్ట్ చాలా.. చాలా...బాగున్నాయి ఫొటోస్ .పాపికొండలు ని చాలా బాగా చూపించారు .... మీ బ్లాగ్ పేరు కి కొత్త అందం వచ్చింది పాపికొండలు పోస్ట్ తో .
>>మీ బ్లాగ్ పేరు కి కొత్త అందం వచ్చింది పాపికొండలు పోస్ట్ తో
థేంక్సండి....... నిజానికి మీ వ్యాఖ్యతో అందం వచ్చినట్టుంది నాబ్లాగ్ కి.
3g గారు, నన్ను మీరు క్షమించెయ్యలి ఈ సారికి. నేను మీ బ్లాగు ని చాలా చాలా లేట్ గా చూశాను.:(
చాలా బాగున్నాయి మీ 3 పోస్ట్ లు:) నాకు మీ శైలి బాగా నచ్చేసింది.:) మీరు నేను ఈ బ్లాగ్లోకం లో దాదాపు ఒకే వయసు వాళ్లం అండీ.. :)
All the best.
మనసు పలికే (అపర్ణ???) గారూ, చాలా చాలా థేంక్సండి. నేను కూడా మీ కామెంట్ చాలా లేట్ గా చూసాను సో మీ క్షమాపణ నా క్షమాపణ రెండూ కేన్సిల్ చేసేద్దాం.
chala chala bagunnayi anDi photos....
Thank u for ur comment Hanu garu
అయ్యయ్యో, ఎంత పని చేశారండీ!
గలగలా గోదారి అనే అందమైన..ఊహూ(..ఎంతో అందమైన పేరుని 3g చేసేశారా?
మీ బ్లాగ్ పాపికొండల చిత్రాలని, మీ ముచ్చట గొలిపే మీ వర్ణనని చదివానండి.
ఎంత భావుకత! నాకు చాలా నచ్చేసింది.
మందాకిని గారూ మీరు మరీ భయపెట్టేస్తున్నారండీ. నేనిప్పటికే నా బ్లాగుకి ఈ పేరుపెట్టి ఖూనీ చేసేసాననుకుంటే :))
ఇక నా పోస్ట్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ఐతే నాక్కూడా కొంచెం భావుకత్వం ఉందనమాట.
అందరూ ఫోటోలు చూసిన ఆనందంలో పైన చదివింది మర్చిపోయి ఉండచ్చేమో కానీ... మీ వర్ణన అద్భుతం
"మబ్బుల చాటుల్లోంచి తప్పించుకొచ్చిన వెలుగు రేఖల పువ్వుల్ని అలలపైన పూయిస్తూ " అలల మీద ప్రతిబింబించే కిరణాలను పూలతో పోల్చడం చాలా బాగుంది. నిజమే.. మామూలుగా సూటిగా కిరణంలా కనిపించే కాంతి పొంగి పొరలుతున్న నీటి మీద చిన్ని చిన్ని ముద్దలలాగా కనిపిస్తుంది.
>>హొయల లయల చలన భంగిమల అందాల విందిస్తూ,గతితప్పిన మనసుల గమ్యాన్ని కాసేపైనా మళ్లిస్తూ, మరచిపోయిన ఙాపకాల్ని మళ్లీఇస్తూ
I just loved these lines :)
ఇక ఫోటోల గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు :)
WoW!! మీ వర్ణనా, ఫోటోలూ రెండూ అద్భుతం! :)
ఇన్నాళ్ళూ మీ బ్లాగ్ ఎట్టా మిస్ అయ్యానబ్బా ..?? ఫోటో లు కేకా :) . పోస్ట్ చదివి మళ్ళీ కామెంటుతా ..:)
సాయి ప్రవీణ్ గారి మాటే నాదీను..మీరు రాసిన ఆ 4 లైన్ల కి నేను ఫ్లాట్ ఐపోయాను... సూపర్..
ఆ చివరి ఫోటో.. అబ్బాబ్బబాబా..కేకంతే..
Please go through this Papikondalu page.
https://www.facebook.com/papikondalu.godavari
Post a Comment