Thursday, November 18, 2010

ఆపరేషన్ లవ్వుత్తరం – శీనుగాడు రిటర్న్స్

ధర్మ పరిరక్షణా ధురంధరుండ...... సకలపాప శిక్షణా దక్షుండ.... ఛంఢతర ధండధర బాహుమండిత విక్రముండ.... నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ........ హ్హ..... య్యముంఢ.

యముడు డి.టి.యస్ వాయిస్ లో చెప్పిన డైలాగ్ కి యమలోకసభ మొత్తం సైలెంటయిపోయింది. ఇవాళక్కడ సంక్రాంతి....పెద్దపండుగ అందుకే యమలోకమంతా సంబరాలివాళ. యమకింకరులందరూ నిన్నే తాజాగా ఒలిపించిన చర్మంతో కొత్త బట్టలు కుట్టించుకున్నారు. ఆడకింకరులంతాకలసి “సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా” అని పాడుకుంటూశెనగపిండిలో మషాలా వేసి కలుపుతున్నారు, ఎందుకని డౌటొచ్చింది కదా! మరేంలేదు నాన్ వెజ్ పాపుల్ని రోజూ మామూలుగా మరిగే నూనెలో వేసి వేపిస్తారుకదా ఇవాళ స్పెషల్ డిష్, వాళ్ళని శెనగపిండిలో ముంచి నూనెలో వేస్తారంతే. బార్బిక్యూ కావాలని పిల్ల కింకరులు గొడవ చేస్తున్నారు అందుకే ఓ నలభైమంది పాపుల్ని పక్కనెట్టి మిగతావన్నీ మేన్ పకోడి చేహెస్తారివ్వాళ. ఇదయ్యాకా రేపంతా ఉపవాసం ఉండాలి, ఎందుకంటే ఇవాళ యమలోకం సెలవుకదా పాపుల్నెవర్నీ తీసుకురారు. అందుకే రేపు ఫుడ్డుండదు.      

సాయంత్రం ఇంద్రలోకం ఆర్టిస్టులతో జరగబోయే డాన్స్ ప్రోగ్రాంకి యముడు దగ్గరుండి స్టేజీకట్టిస్తున్నాడు.

ఇంతలో చిత్రగుప్తుడొచ్చి యముడి చెవిలో ఇవాళ ఒక ప్రాణం తేవాల్సుందని గుర్తుచేశాడు. పండగమూడ్ చెడగొట్టిన కోపంలో గట్టిగా అడిగాడు.

”ఎవరా పాపి?”

”శీనుగాడు స్వామి!! ఇవాళ తేవాల్సిన ఒకేఒక్క ప్రాణం.”

”అహో........ సెలవురోజున చావు ఎలారాసావు గుప్తా..... అవతల డాన్సుకి టయమయిపోతుంటే!!!”

”అయ్యో.......! నేను రాయలేదు స్వామి. నిన్న మన యువరాజు బ్రహ్మలోకం స్టాఫ్ తో కలిసి తధాస్తు రౌండులకెళ్ళినప్పుడు, శీనుగాడు భానుగాడి ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తానంటుండగా వరమిచ్చి వచ్చాడు”.

“అటులైన వాహనము సిద్దం చేయుము శీఘ్రమే వెళ్ళి ఆ పాపిని పట్టెద, యమపాశము చుట్టెద, యమనగరికి తెచ్చెద”  ఉహహహహ్హహ్హ.......హ్హా........................... ఉహుహహ్హహ్హహ్హ.....హ్హా............ ఒరే భానా....... భానా........ హహహహ్హహ్హాహ్హ....... భానుగే......హ్హహ్హహ్హా.......... ఒరే భానుగా........... 

***

యముడి వాయిస్ కన్నా హైపిచ్ లో వచ్చిన ఆ అరుపుకి టక్కున లెగిసికూర్చున్నాడు మంచంమీద. 

అసలే మనోడి బుర్రలో విషయం తక్కువ వైశాల్యం ఎక్కువ, అందులోను రెండు ప్రోగ్రాములు ఒకేసారి రన్ అయ్యేసరికి సిస్టం హేంగయ్యి తింగరి చూపులు చూడ్డం మొదలెట్టాడు. బామ్మ డిప్పమీదొకటి పీకటంతో సర్క్యూట్లన్నీ సర్దుకొని ఒక్కొక్కవిషయం గుర్తుకురాసాగాయి. ఈడు బుజ్జికి రాసిన ఉత్తరం, అదివ్వటానికి శీనుగాడితో వేసిన ప్లాను, బుజ్జితో ఏసుకున్న డ్రీమ్ డ్యూయెట్లు అన్నీ బ్లాక్ & వైట్ లో కనిపించి కనువిందుచేయడంతో ఈడి మనసులో పులకరింత కళ్ళల్లో కలవరింత ఒకేసారి కలిగాయి. 

అసలు న్యూటన్ సూత్రాలు అప్పట్లో కనిపెట్టకపోయుంటే ఇప్పుడవి భానుగాడి సూత్రాలుగా చలామణి అయ్యేవి, ఎలాఅంటే బామ్మగాని ఈడి బాబుగాని బాహ్యబలం ప్రయోగించనంతవరకు ఈడుపడుకునున్న స్థితిలోగాని, పరధ్యానంగాఉన్న పరిస్థితిలోగాని ఏ మార్పూ ఉండదు. ఇప్పుడు కూడా మళ్ళీ లాగిపెట్టి ఒకటిచ్చుకున్న తర్వాతే మామూలు మనిషయ్యాడు. తరువాతి చర్యగా ఇంకాలేవలేదని ఈళ్ళనాన్న అరవడం దానికి ప్రతిచర్యగా ఈడు లెగిసి తయారవడం పూర్తయ్యాయి. 

ఇవాళ ఈడి జీవితం వంకర తిరిగీ రోజు..., అదే మలుపు తిరిగే రోజు. అందుకే తిన్నగా నిలబడి దేవుడికి దణ్ణంపెట్టుకున్నాడు, వచ్చిన కల నిజమవ్వకూడదని రాసిన ఉత్తరం వేస్టవ్వకూడదని. బయటింత చలిగా ఉన్నా ఈడికి చెమటలు మాత్రం ఆగట్లేదు. ఈడి కళ్ళల్లో కంగారు కాళ్ళలో వణుకు చూసిన బామ్మ నుదుటిమీద ఓ గుప్పెడు, నోట్లో ఓ గుప్పెడు విభూదికొట్టింది. అన్నిటికీ దేవుడేఉన్నాడని చెప్పటానికి ఇది బామ్మకున్న మేనరిజమ్.  దాంతో ధైర్యం తెచ్చుకున్న బానుగాడు తలగడకిందున్న ఉత్తరం తెచ్చి దానిక్కొంచెం పసుపురాసి కుడి జేబులోపెట్టుకుని బయటికొచ్చాడు.
***
సీనుమళ్ళీ శీనుగాడి ఇంటికి మారింది.

ఇవాళ శీనుగాడి కళ్ళల్లో కొత్త వెలుగు కనిపిస్తుంది. బళ్ళో చదువుకునేప్పుడు భానుగాడు చేసిన సాయానికి ఎప్పుడికైనా బదులు తీర్చుకోవాలనుకునేవాడు. ఆ అవకాశం ఇప్పుడుకొచ్చింది. పండక్కేంకావాలని ప్రేమగా అడిగిన ఆళ్ళమ్మకి చంద్రముఖి సినిమాలో జ్యోతికలా ఒకచూపుచూసి ఆవేశంగా చెప్పాడు.................................

”భాను కళ్ళల్లో ఆనందం చూడాలి.”

ఇంతలో భానుగాడొచ్చాడు. ఆపరేషన్ లవ్వుత్తరం ఆచరణకు సంబందించి మొదటి ద్య్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయ్. మోకాలితో ఒకసారి అరికాలితో ఒకసారి తీవ్రంగా ఆలోచించిన తరువాత రెండు ప్లాన్లతో బ్లూప్రింట్ రడీ అయ్యింది. ముఖ్యమైన పోయింట్లేంటంటే..

1. బుజ్జి బాబు (అంటే బుజ్జి యొక్క బాబు) పస్తుతం పదవిలోఉన్న పెసిడెంటుకాబట్టి పెద్దగా రిస్కులుసెయ్యికుండా పనైపోవాలి.

2. బుజ్జి ఫ్రెండ్స్ తో (అంటే బుజ్జి మరియు దాని ఫ్రెండ్స్ తో) రామాలయంనించి తిరిగొచ్చేప్పుడు తూములొంతెన మలుపు కాడ శీనుగాడు సైకిలు మీదెల్లి బానుగాడి పేరుచెప్పి ఉత్తరం బుజ్జి చేతిలో పెట్టెయ్యాలి.

3. వేణుగాడికి గేర్లుసైకిలుండడంవల్ల అదీఆపరేషన్లో బాగా అవసరం అవడంవల్ల వేణుగాణ్ణి తప్పకుండా పిలవాలి.

ఏణుగాడురావటం భానుగాడికి ఇష్టంలేకపోయినా సైకిల్ కోసం పిలవక తప్పలేదు. కాని ముఖ్యమైనపని ఏంచెయ్యాలన్నా ముగ్గురు ఉండకూడదని బామ్మ చెప్పడంవల్ల నాలుగోకేండెట్టు కోసం సెలక్షన్లు మొదలెట్టాడు శీనుగాడు. ఊళ్ళో ఈళ్ళకంటే పనికిమాలినోడు ఎవడాని ఆలోచించి సివరికి భానుగాడికి బావ్వరసయ్యే జోగ్గాణ్ణి (కన్ఫ్యూజ్ అవ్వకండి జోగి + గాడిని = జోగ్గాణ్ణి, అసలుపేరు జొన్నపొత్తుల గోపాలం కాని ఊళ్ళో సింపుల్గా ’ఒరే జోగ్గే’ అంటారనమాట) పిలుచుకొచ్చారు. ఈడు కూడా శానా గొప్ప కేండేటే.

మీకీడితో పరిసియం లేదుగామట్టి మనోడిగురించో ఐడియా రావాలంటే ఓ చిన్న ఇంట్రడక్షన్ ఏసుకోవాలి. ఈడు ప్లాష్ బేక్ లో ఏడుకొండలు & కో మూజికల్ నైట్ లో యాంకరింగ్ చేసీవోడు. అంటే మరీ ఓంకార్ లెవిల్లో కాదుగాని ఓ మాదిరి దేశీ మోడల్లో. తరువాత వచ్చేపాటని అనౌన్స్ చెయ్యటం, పదో పరకో ఇచ్చినోళ్ళకి కళాభివందనాలు చెప్పటం లాంటివన్నమాట. అదే ట్రూపులో ఓ పిల్లని చూసి ఈడు తగులుకోవడం ఆపిల్ల ఈణ్ణి చూసి జడుసుకోవడం ఆతర్వాత పనొదిలిపెట్టి పారిపోవడం లాంటివి జరిగింతర్వాత ఈడికి జ్ఞానోదయం అయ్యింది. అప్పట్నించి పాలసీ మార్చి ’కావాలనుకుంది దొరకనప్పుడు.......... దొరికిందాన్నే కావలించుకోవాలని’ ఎదురుచూస్తూ ఉండేవాడు. క్రిందటిసారి పండక్కి పక్కూర్లో ప్రోగ్రాం ఇస్తుండగా దండట్టుకొచ్చిన ఒకావిణ్ణి చూసి ఈడికోసమే వచ్చిందనుకొని నానారకాలుగా ఇంప్రెస్ చెయ్యడం మొదలెట్టాడు. మీరు మినిస్కర్టేసుకుంటే మనీషాలా ఉంటారని, మైకట్టుకుని పాడితే జనాలు మైకమొచ్చి పడిపోతారని....... ఇలాంటియ్యనమాట.  పక్కనే ఉన్న ఆళ్ళాయనికి ముందిదంతా సూసి సిరాకొచ్చింది.......... కసేపాగి ఆలోచిస్తే కోపమొచ్చింది, ఆతర్వాత పిలిచినెంటనే ఇంట్లోంచి టామి వచ్చింది.......... అది కరిసినెంటనే ఈడొంట్లోంచి రత్తమొచ్చింది. ఓ గంటాగేకా గంటలు కొట్టుకుంటా గంటలకారొచ్చింది........ ఇప్పుడిదెందుకని మీఅందరికీ డౌటొచ్చింది........కదా! ఏంలేదు ఎవడో కంగార్లో అంబులెన్స్ కి ఫోన్ చెయ్యాబోయి ఫైరింజన్ కి చేసాడు. చివరికి దాంట్లోనే ఆస్పిటల్కి తీసుకెల్లి చెయ్యాల్సినవన్నీ చేయించేరు. ఆ తరువాత ఈణ్ణి ట్రూపులోంచి పీకెయ్యడం, పడుంటాళ్ళేఅని బానుగాడి నాన్న కేకెయ్యడం జరిగాయి. 

***

ఇక ఇప్పుడి ఇషయానికొత్తే ఇలాంటి ఎదప్పనుల్లో ఏలుపెట్టడం మనోడికి బాగా ఇష్టంగామట్టి మొన్న తీరతంలోకొన్న మెరుపుల్ది ఎరుపురంగు సొక్కా, నీళంఫ్రేముది కూలింగ్ కళ్ళజోడు పెట్టుకొని ఈణ్ణి కేకేసిన ఇద్దరికీ కళాభివందనాలు సెప్పి గ్రూపులో జాయినైపోయేడు. ఉప్పుడు ముగ్గురూ కల్సి ఏణుగాడికోసం ఎల్లేరు. ఈళ్ళెల్లేసరికి ఏణుగాడింటికాడ పరిస్థితి శాలా ఘోరంగా ఉంది. ఏణుగాడి అమ్మానాన్న పక్కింటి పిల్ల జమిందారి ఫేమిలీతోటి భీబచ్చంగా కొటేసికుంటున్నారు. ఇద్దరెంపునున్న జనాలు బలవంతంగా ఎనక్కిలాగవలిసొత్తుంది.

 ఈ గొడవ మజ్జిలో పాపం ఏణుగాడు దీనంగా, బోర్లించిన బుట్టొంక సూత్తాకూచ్చున్నాడు. ఈడికోసమొచ్చిన ముగ్గురికీ ఇషయమేంటో అర్ధంకాక మెల్లగాఅడిగారు ఏమైందిరాఅని. ఏణుగాడు ఏలితోటే బుట్టొంక సూపెట్టేడు. జోగ్గాడెల్లి బుట్టకొంచెం పైకెత్తేడు. ముందులైటుగా పొగొచ్చింది, ఆతరవాత అసలు విషయం కనిపిచ్చింది. ఒక్కోడిపెట్ట ఓకోడిపుంజు సగంకాలి సచ్చిపోయున్నాయ్. మళ్ళీఅర్దంకాక ఇవరంగా అడిగితే ఈ విషయం తెల్సింది. ఇయ్యాల పొద్దున్నే కోడికూసేకా ఏణుగాడికో అయిడియావచ్చింది. కోడి చేత గుడ్డు కాకుండా ఆమ్లెట్ ఎందుకు పెట్టించలేమోచూద్దామని ఈళ్ళకోడిపెట్టని గుడ్డెట్టీ టయానికి పట్టుకొచ్చి కట్టిల పొయ్యిమీదెట్టాడు వేడిచేత్తే డైరెట్టుగా ఆమ్లెట్టొత్తాదని, కాని ప్రయోగం ఫెయిలయ్యి అది పైకిపోయింది. ఉప్పుడు మనోళ్ళకి సగం క్లియరయ్యింది. మరి పుంజెలా వచ్చిందంటే, అది పక్కింటి పిల్ల జమీందారిది పందెంకోడి, ఈరెండూ చానా రోజిల్నించి పేమించుకుంటున్నాయ్. పెట్టని పొయ్యిలోపెట్టడం చూసి ఇదికూడా దాంట్లోకి దూకేసింది. పతీసహగమనం అన్నమాట. అందుకే ఈ గొడవ.

సరే అయ్యిందేదో అయ్యిందని ఈడికి అసలు విషయం చెప్పి సైకిల్తోపాటు తూములొంతెన కాడకి తీసుకొచ్చేహేరు. భానుగాడికి మాత్రం మనసులో అనుమానం పోలేదు ఏణుగాడి విషయంలో. ఆల్రెడీ పొద్దిన్నే ఒక ప్రేమజంటని పైకి పంపించేహేడు. ఇటు వేణుగాడిక్కూడా ప్రయోగం ఫెయిలయ్యిందని మూడంతా డేమేజైపోయింది. మనజోగి పరిస్థితి కూడా అంతే ఇందాకణ్ణించి సచ్చిపోయిన రెండుకోళ్ళు ఈడికిత్తేబాగుణ్ణని ఆలోచిత్తున్నాడు. ఇలా ఎవడిగోల్లో ఆడుండడంతో సిరాకొచ్చిన శీనుగాడు గట్టిగా రెండు కేకలేసి సిట్యువేషన్ మొత్తం ఈడి ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

”భానుగా..... నువ్వేం భయపడకరా పదిమందిని ఎదిరించైనా, పెసిడెంటుని బెదిరించైనా బుజ్జినితెచ్చి నీచేతుల్లో పెడతాను.....పెడతాను.....పెడతాను” అని మూడుపక్కలకీ తిరిగి గట్టిగా అరిచి పంచభూతాల మీద ప్రమాణం చేశాడు శీనుగాడు. దాంతో తెరంతా ఉరుములు మెరుపుల్తోటి ఒకసారి గట్టిగా షేకయ్యి తరవాత కెమేరా జోగ్గాడిమీద ఫోకస్సయ్యింది. 

“ఒరే శీనూ.... ఆవేశపడాకు పదవొచ్చినోడి ఇంటిమీదకెళ్ళి గొడవేసుకురావడమంటే, వరదొచ్చిన గోదాట్లోకి పడవేసుకెళ్ళడం లాంటిది, పడవ పక్కకి ఒరిగినా... గొడవ ఎక్కువ జరిగినా కారిపోయేది మన పులుసే” అనింకాఏదో చెప్పబోయేడు గానీ.....

ఈడు చెప్పడంపూర్తయ్యేలోపు దూరంగా బుజ్జి రావడం కనపడింది. భానుగాడు ఎంటనే పరిగెత్తుకుంటూఎల్లి మెరకీదిమల్లిగాడి పాక్కాడున్న మావిడిచెట్టెనకాల దాక్కుండిపోయాడు. మిగతా ముగ్గురూ ముందు కొంచెం కంగారుపడ్డారుకాని తరవాత అందరూ కల్సి భానుగాడిదగ్గరకెల్లారు. కొంచెం కంగారుపడతా చెప్పేడు భానుగాడు శీనుగాడితో

"ఒరే ఇయ్యాలొద్దులేరా........ తరవాతిద్దాం ఉత్తరం”.

”మళ్ళీ ఏవైందిరా.....”

“బుజ్జెనకాల ఆళ్ళ బాబు ఎవర్నైనా పంపిత్తే.... గొడవైపోద్ది వద్దులేరా... ఇంకో సవచ్చరం ఆగిద్దాంలే”

”చీ....... నీ......... ఇంకో సవచ్చరం ఆగితే ఆళ్ళబాబుతో బాటు ఆళ్ళాయన్తోకూడా గొడవెట్టుకోవాలి, ఒరే జోగ్గా నువ్వీ సెట్టెక్కరా ఎవ్వడైనా అనుమానంగావత్తం కనబడితే ఒక్కూతకుయ్.... వేణుగా నువ్వీడితోపాటే ఉండు ఏమైనా తేడావత్తే ఈణ్ణితీసుకెల్లి పాకలో దాసై... నువ్వుత్తరం ఇటియ్” అనందరికీ పనుల్చెప్పేసింతర్వాత భానుగాడిదగ్గిర ఉత్తరం, వేణుగాడి దగ్గర సైకిలు తీసుకొని బుజ్జొచ్చే వైపుకెల్లేడు శీనుగాడు.

జోగ్గాడేదోలా కష్టపడి చెట్టుమీదకెక్కేడు. కింద వేణు, భాను శీనుగాడెల్లినవైపే ఆత్రుతగా చూస్తున్నారు. అసలెందుకోగాని అందరికంటే వేణుగాడికే ఎక్కువ టెంషన్గా ఉంది. బుజ్జింకా మలుపుకాడికి రావట్లేదని ఒసారి పరాగ్గా పక్కకి తిరిగేడు. అంతే ఒక్కసారిగా జడుసుకొని నిలబడిపోయాడు. పక్కన భానుగాడు లేడు ఎవడో నల్లముసుగేసుకొని ఈడి కళ్ళల్లోకే చూస్తున్నాడు. అక్కణ్ణించి పారిపోదామనుకున్నాడుకాని అంతలోనే ముసుగులోంచి 

”ఉప్పున్నన్నెవరన్నా గుత్తుపడతారంటావేట్రా” అనోసౌండొచ్చింది.
    
గొంతు బాగాపరిచయం అవడంవల్ల కొంచుం కంగారు తగ్గి చెప్పాడు ”ఒరే భానుగే ఎవడికన్నా దొరక్కూడదంటే ఆడికళ్ళు ముయ్యాలిగాని మనకళ్ళు మూసుకోకూడదురా ముందా ముసుగు తియ్” అని.

ఇంతలోనే పైనుంచి కుయ్యిమని కూతకూసి కిందకి పడిపోయాడు జోగ్గాడు. విషయమేంటోఅని ఇద్దరూ దగ్గరికెళ్ళేరుగాని ముసుగేసుకున్న భానుగాడి కాళ్ళుపట్టేసికొని “నాకేంతెల్దుబాబోయ్ నన్నొదిలై బాబోయ్” అని బతిమాలడం మొదలెట్టాడు. ఈడుకూడా ముసుగులో కాలేసేడని ఆనందంతో భానుగాడు కొంచెం ముసుగుపైకెత్తి ”బా...వ్..ఆ..” అన్నాడు. 

***

అక్కడ మలుపుకాడ శీనుగాడు ఉత్తరంపట్టుకొని రడీగా ఉన్నాడు. అప్పుడేకోసుకున్న ఉసిరికాయ కోసం మిగతావాళ్ళతో గొడవపడుతూ అప్పుడే మలుపు కాడకొచ్చింది బుజ్జి. ఎంట్నే శీనుగాడు ఉత్తరం బుజ్జిచేతిలో పెట్టేసి సైకిలేసుకొని ఎనక్కుసూడకుండా తొక్కుకొచ్చేత్తున్నాడు. భానుగాడు టెంషన్ తోటి, వేణుగాడు ఆనందంతోటి, జోగ్గాడు టెంషన్తో కూడిన ఆనందంవల్లొచ్చిన ఆచ్చర్యంతోటి సైకిల్ మీదొస్తున్న శీనుగాడొంక చూస్తున్నారు. సరిగ్గా ఇదే నిమిషంలో కాలానికి కన్నుకుట్టింది, అనుకున్నది జరిగిన ఆనందంలో ఎగిరెగిరి తొక్కుతున్న శీనుగాడి సైకిలికి అడ్డంగా దురదుష్టం దున్నపోతు రూపంలో వచ్చింది. గుద్దేత్తాడేమో అని భయమేసి ముందు బలంగా బ్రేకేసేడు అది పడకపోయేసరికి దాన్ని గుద్దేసి గట్టిగా కేకేసేడు. 

***

అక్కడ కత్తిరిస్తే మావిడిచెట్టుకింద పడుకోబెట్టిన శీనుగాడు, ఆడిపక్కన భానుగాడు, ఓమూలకి సైకిలు చెక్రం దానొంక దీనంగా చూస్తున్న వేణుగాడు ఉన్నారు. మరింకోడేడని కదా మీ డౌటు ఆడు ఈరబాబుని తీసుకొత్తాకి ఊళ్ళోకెల్లాడు. ఊరంతటికీ ఈరబాబు ఒకడే ఆరెంపీ అవ్వడంవల్ల, ఇయ్యాల పండగ అవ్వడంవల్ల ఈడురావడం లేటవ్వుద్దిమరి. అప్పుడిదాకా కొంచుం వేట్ చెయ్యాలి మరిమీరు.

37 comments:

Anonymous said...

soooooooooper

నీహారిక said...

ఇప్పటికి రాసారు. బాగుంది.

మంచు said...

హ హ హ....దీంట్లొ నువ్వు సీనువా.... భానువా ?
త్రివిక్రం స్టైల్ పంచ్‌లు అదిరాయ్ బాస్...సూపర్.
నిన్ను బెదిరిస్తే కానీ రాయవ్ అని ఇప్పుడు అర్ధం అయింది.. ఇక చూస్కొ మరి

Sravya V said...

మొత్తానికి ఇన్నాళ్ళకి మీరు , భూమి, చంద్రుడు ఒకేసరళరేఖలోకి వచ్చారన్న మాట ;)
పోస్టు బాగుంది !

3g said...

@అనానిమస్: థాంక్యు
@నీహారిక: థాంక్యు. అవునండీ ఇప్పటికి కుదిరింది.
@మంచు: హ హ బెదిరింపులా మీరుమరీ అలా డిసైడ్ అవ్వకండి. ఇక ఈ పోస్టుకీ నా లైఫుకి ఏ సంబందమూ లేదు. హడావిడిలో పెట్టేసిన బ్లాగుపేరుకి న్యాయంచేద్దామని ఏదో ఇలా ట్రై చేస్తున్నా. మీకు నచ్చినందుకు చాలా చాలా థేంక్స్.
@శ్రావ్య: థేంక్యు... హ హ సరళరేఖలోకి నేను రాకపోయినా మీరంతా పంపేసేలాఉన్నారు నన్ను.

కొత్త పాళీ said...

హ హ హ. సూపర్ బాసు..
కోడి డవిరెక్టుగా ఆమ్లెట్టు పెట్టడం .. బ్రిలియంట్

రాజ్ కుమార్ said...

వంశీ, త్రివిక్రమ్ స్టైల్ లో రాసినట్టుంది.. దుమ్ము దులిపేరు.. పంచ్ లతో పిచ్చేక్కిన్చేరు..
నా పాత ఈక్వేషన్ : 3G = వంశీ2
కొత్త ఈక్వేషన్ : 3G = వంశీ + త్రివిక్రమ్ .. కూసిన్ని ఎక్కువ పోస్ట్లు రాయండే... :)

కృష్ణప్రియ said...

సూపర్! :-)))

నిషిగంధ said...

:))))
ఇలా టూ మచ్ గా నవ్వించేస్తే కష్టమండి :-)

నేస్తం said...

:)ఏంటండీ బాబు ఇంత నవ్వించేసారు ... లవ్ లెటర్ కు పసుపు రాయడం,ఆంలెట్ కోసం కొడిపెట్టను పొయ్యిలో కూర్చో పెట్టడం ...
>>>>>>చీ....... నీ......... ఇంకో సవచ్చరం ఆగితే ఆళ్ళబాబుతో బాటు ఆళ్ళాయన్తోకూడా గొడవెట్టుకోవాలి,
హ హ సూపరు ..ఇక ఆలస్యంగా రాస్తే ఊరుకునేది లేదు మరి :)

మనసు పలికే said...

బాబోయ్.. 3g గారు, ఇలా నవ్వించి నవ్వించి చంపెయ్యడం మీకు భావ్యంగా ఉందా అంట.. ఎంత పోస్ట్ పెట్టడం లేట్ అయితే మాత్రం ఇలా మీ కక్ష అంతా ఒకేసారి తీర్చుకోవాలా.. :D :D
ముందు ఆ శైలి చూస్తేనే నవ్వొచ్చేసింది.. ఇక మీ ఆపరేషన్‌లో ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే కడుపు నొప్పి వచ్చేసింది..:)) యమలోకం కాన్సెప్టు అదుర్స్.. బాబ్బాబు నాక్కూడా కొన్ని ఇలాటి ఐడియాలు ఇవ్వొచ్చు కదా.. ష్.. ఈ విషయం ఎవరికీ చెప్పకండి..:))

ravi said...

chaala baga raasaru. Maree january varaku wait cheyinchakunda tondaraga next part raayandi. please.

వేణూశ్రీకాంత్ said...

శీర్షికలో ఉన్న లవ్వుత్తరం దగ్గర చిరునవ్వుతో విడివడిన నా రెండు పెదాలు టపా లోకి వెళ్ళేకొద్దీ దూరాన్ని పెంచుకుంటూ పోయి చదవడం ఐన ఓ పదినిముషాలకు మళ్ళీ కలుసుకొన్నాయి. మహా ప్రభో ఇలాంటి అవిడియాలు ఎలా వస్తాయి మీకు. కోడితో ఆమ్లెట్టెట్టించడం, పుంజుగారి పతీసహగమనం, జోగ్గాడి ఫ్లాష్ బాకు, కళాభివందనాలు, ఏడాదాగితే వాళ్ళాయన్తోకూడా గొడవెట్టుకోడం, ఉసిరికాయకోసం గొడవేసుకుంటూ రావడం వేటికవే సూపరు.

>>"పదవొచ్చినోడి ఇంటిమీదకెళ్ళి గొడవేసుకురావడమంటే, వరదొచ్చిన గోదాట్లోకి పడవేసుకెళ్ళడం లాంటిది"<< ఏం చెప్పార్సార్ నాకు భలే నచ్చేసింది.

3g said...

@కొత్తపాళీ: థేంక్యు
@వేణూరాం: థేంక్యు...మీరిలా కొత్త ఈక్వేషన్లివ్వకండి. అసలోళ్ళు చూస్తే బాగోదు:)
@కృష్ణప్రియ: థేంక్యు
@నిషిగంధ: థేంక్యు
@నేస్తం: థేంక్యు
//ఇక ఆలస్యంగా రాస్తే ఊరుకునేది లేదు మరి//
ఏంటండీ మీరుకూడా మంచుగారితో కల్సిపోయారా.:)అయినా ఈసారి బెదిరింపులకి లొంగం.
@అపర్ణ: థేంక్యు..... సీక్రెట్లిలా పబ్లిగ్గాచెప్పకూడదండీ... అయినా నేనే మీ అయిడియాలు కాపి కొట్టేద్దామనుకుంటుంటే...:)
@రవి: థేంక్యు
@వేణు శ్రీకాంత్: థేంక్యు.... సరిగ్గా మీకు నచ్చినవే నాక్కూడా నచ్చాయ్.:)

జయ said...

భలే సరదాగా ఉందండి. నిజంగానే అందరడిగినట్లు మీరు కొంచెం తరచుగా రాస్తే కడుపారా నవ్వుకోవాలని ఎదురు చూస్తాను మరి.

హరే కృష్ణ said...

కెవ్వ్...
కుమ్మేసావ్ అంతే :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఆమ్లెట్టు, జోగ్గాడి కధ, న్యూటన్ సూత్రాలు బావున్నాయి.చాలా నవ్వులు ఒలికి పోయాయి.మంచి టపా.నేను కూడా కెవ్వుకెవ్వు.

మధురవాణి said...

Excellent post! సూపరంటే సూపర్ అసలు! తెగ నవ్వించేశారు! పైన అందరూ చెప్పినట్టు మీరు తరచూ రాయాలండీ! :)

Sai Praveen said...

మాస్టారూ.... అసలు ఎలా వస్తాయి ఇన్ని అవిడియాలు :)
ఇంచు ఇంచుకో పంచు గుద్దారు సారూ :) పలానా డైలాగ్ నచ్చింది అని చెప్పడానికి లేదు. ఇంతకంటే నేనేమి రాయలేను కాని ఎంత బాగుందో చెప్పడానికి ఇది సరిపోదు :)
తరచూ రాయండి అనేది మీ అభిమానులందరి కామన్ కోరిక :)

మంచు said...

అలా అడిగితే రాయరు 3జి గారు... దానికి వేరే పద్దతుల్లున్నాయ్..... నన్ను అడగండి చెప్తా :-)

Sai Praveen said...

మంచు గారు,
ఇప్పుడే 3g గారికి నా బ్లాగ్ లో రిప్లై రాసాను చూడండి :)
3g గారు,
అడగడం మర్చిపోయా, పల్లెటూరి వాతావరణాన్ని వర్ణించడం చాలా బాగుంది మీ కథలో. మీది ఏ ఊరు?

ఆ.సౌమ్య said...

హమ్మయ్య మొత్తానికి ఇంకో టపా రాసేరన్నమాట. అవునూ, తరువాతి టపా రాసేటప్పుడు నాకు కబురెడతానని మాటిచ్చారుగా, మరచిపోయారా. మీరు మాట నిలబెట్టుకోకపోవడం వల్ల నేను టపా ఆలీసంగా సూసినాను.
టపా మాత్రం కేక బాసూ, చింపి చింపి చింపి చింపి వదిలావ్.....త్రివిక్రం టైప్ పంచ్ లు చాలా బాగా పండాయి. మొదట్లో నాకు నచ్చినవి కొన్ని quote చేద్దామనుకున్నా చివరాకర్న చూస్తే అన్ని వాక్యాలు కోట్ చేసేలా ఉన్నాయి. మీ టపా మళ్ళీ కాపీ, పేస్ట్ ఎందుకనీ ఆ పని విరమించుకున్నా. ఇలా పున్నానికో, అమాసకో ఓ పోస్టు రాయకపోతే రోజూ రాయొచ్చుగా.

హా తరువాతి టపా కోసం ఇంకెన్నాళ్ళు వైట్ చెయ్యాలి బాబూ?

ఆ.సౌమ్య said...

మంచు గారూ ఈ పిల్లాడి చేత రోజూ రాయించే ఉపాయమేదో ఉందన్నారు? ఏమిటది మాకూ చెప్పండి. మేమూ సతాయిస్తాం, అప్పటికిగానీ పోస్ట్ రాయడు ఇతగాడు.

Anonymous said...

http://vivaadavanam.blogspot.com/

Ram Krish Reddy Kotla said...

త్రీజీ అన్నాయ్ సూపరంటే సూపరంతే ... కొన్ని పంచులు కేక ...
>>పాపుల్ని శనగపిండిలో వేసి నూనెలో వేయిన్చుతారా ...బాబోయ్ య్ య్ ...
>> కోడి చేత డైరెక్టుగా ఆమ్లేయ్ వేయించడానికి దాన్ని పోయి పెడతారా... హా హా హా .. పిల్లికి చెలగాటం.. ఆ టైప్ అనమాట
అసలు కెవ్వు డైలాగ్ ఏంటంటే "ఆవేశపడాకు పదవొచ్చినోడి ఇంటిమీదకెళ్ళి గొడవేసుకురావడమంటే, వరదొచ్చిన గోదాట్లోకి పడవేసుకెళ్ళడం లాంటిది, పడవ పక్కకి ఒరిగినా... గొడవ ఎక్కువ జరిగినా కారిపోయేది మన పులుసే" ఇది...

తర్వాతి పార్టు తొందరగా రాయి ...

శివరంజని said...

ఏంటండీ బాబు ఇంత నవ్వించేసారు....3gగారు..... చచ్చిపోయాను బాబోయ్ చచ్చిపోయాను నవ్వలేక ...ఈ వారం లో ఇంతాలా నవ్వింది ఈ రోజే ...బాబోయ్ బుగ్గలు నొప్పేట్టేసాయి నవ్వలేక ... కొన్ని పంచులు మాత్రం 2 -3 సార్లు చదివాను ..అంత బాగున్నాయి

sunita said...

andaroo cheppaesaaru. vipareetamgaa navvinchaaru.migilinabhaagam tvaragaa raayanDi mari. baav..? hahaha...eamiTanDee baabu. ilaa kooDaa raayachchaa...

3g said...

జయగారూ.... థాంక్యూ.

థాంక్యూ హరే.

సుబ్రహ్మణ్యం గారూ థాంక్యూ.

మధురవాణి గారూ... థాంక్యూ.

థాంక్యూ ప్రవీణ్... మాఊరు కావాలంటే మీఊరినుంచి మంచు గారి ఊరి వైపు ఓ ఇరవై కిలోమీటర్లు రావాలి :).

సౌమ్యగారు... థాంక్యూ..
//అమాసకో ఓ పోస్టు రాయకపోతే రోజూ రాయొచ్చుగా. //
మీరు భలేవారండీ నేనేమన్నా వేలుతిరిగిన రచయితననుకున్నారా ఏంటి రోజుకో పోస్టురాయటానికి:).

కిషన్ థాంక్యూ...

థాంక్యూ శివరంజని గారూ..... మీరింకా మంచుగారి పోస్టు చూళ్ళేదనుకుంట:)

సునీత గారూ థాంక్యూ....

//అలా అడిగితే రాయరు 3జి గారు... దానికి వేరే పద్దతుల్లున్నాయ్..... నన్ను అడగండి చెప్తా :-)//
మంచుగారూ... అయితే నేను మిగతా పార్టు చుంబరస్కాకి పేటెంటు దొరికినెంటనే రాస్తా :):)

శివరంజని said...

3G గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

Anonymous said...
This comment has been removed by a blog administrator.
బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

రాజ్ కుమార్ said...

mee next post eppudoo?? :)

Sai Praveen said...

సేం కొచెన్ :)

..nagarjuna.. said...

నా కామెంటు = పైనున్న 33 కామెంట్లు మైనస్ మీ కామెంట్లు మైనస్ శుభాకాంక్షల కామెంట్లు + ఓక పే.......ద్ద కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక + ఇరగ్గ్గుమేహేరు

నేస్తం said...

:( eppudu next part

వేణూశ్రీకాంత్ said...

లేడీస్ టైలర్ లోని ఈ టైటిల్స్ సాంగ్ ని తన బజ్ ద్వారా గుర్తు చేసిన వేణూరాం కు థ్యాంక్స్ చెప్పుకుంటూ.. మీకోసం ఈ పాట

వేటాడందే ఒళ్ళోకొచ్చీ చేప చేరదూ..
రెక్కాడందే గూటిలోకి కూడు చేరదూ..
తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదూ..
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
““ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకి వదిలి పోదా..?””
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా?
లేవర..లేవరా.. సుందర.. సుందరా...చాలు రా నిద్దరా

కనుక అయ్యా 3g గారూ ఐదునెల్లయ్యాయ్ ఇక తవరు బద్దకాన్ని ఒగ్గేసి ఓ పాలి మీ పాళీని ఝుళిపించి ఈ టపాకి తరువాయిభాగం అర్జంట్ గా రాసేసి మేం మా టెన్షన్ వల్ల పాడుచెసుకున్న ఆరోగ్యానికి హాయిగా నవ్వేసుకునే మీ ’శీనుగాడు సిరంజీవి ఫాన్’ అనే మందేసి మళ్ళీ బాగు చేత్తారని ఆసిత్తన్నాం.. ఆపైన తవరి దయా మా ప్రాప్తం :-)

ఇట్లు,
అటుకుల సిట్టిబాబు
ఈరాసరం(అదేనండీ మీరంతా వీరవాసరం అంటారు గదండీ అదే)

రాజ్ కుమార్ said...

సూపరు వేణూజీ.. అయ్యా GGG గారూ.. ఎంతకాలం? ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు ఎదురు చూడాలండీ?

Post a Comment